Sunita Williams: సునీత విలియమ్స్ అద్భుతమైన వీడియో.. అంతరిక్షంలో ఆమె జీతం ఎంతో తెలుసా..!
By
Vaasthava Nestham
Sunita Williams: మన ఇండియన్స్ కి సునీత విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాసా ఆస్ట్రో నాట్ సునీత విలియమ్స్ గత కొన్ని నెలల క్రితం అంతరిక్షంలో చిక్కుకపోవడంతో ఆమెను తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్క్లూ సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నాసా స్పేస్ ఎక్స్క్లూ సంయుక్తంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ ను ఈనెల 15న కెనడి స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపించారు. దిగ్విజయంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమె అంతరిక్షం నుండి తిరిగి భూమి పైకి సేఫ్ గా ల్యాండ్ అయినా అద్భుత వీడియోలు మీకోసం.
మరి గడిచిన 9 నెలలుగా ఆమె అంతరిక్షంలో ఏ విధంగా ఉన్నారు.. ఎలా గడిపారు.. అసలు ఆమె జీతభత్యాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో నాసా వ్యోమగాముల ఆహార ఖర్చులను భరిస్తుంది. ఇక సునీత విలియమ్స్, విల్ మోర్ జిఎస్ 15 ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. వీరు అమెరికాలోని అత్యధిక జీతం అందుకుంటున్న వారిలో వీరు కూడా ఉన్నారు. బేసిక్ సాలరీ 1,25,133 డాలర్ల నుండి 1,62,672 డాలర్లుగా ఉంటుంది. అక్షరాల మన ఇండియన్ కరెన్సీ లో 1.8 కోట్ల నుంచి 1.41 కోట్ల మధ్య అన్నమాట. అయితే ఈ వ్యోమగములు అంతరిక్షంలోకి వెళ్లిన ఇదే స్థాయిలో జీతం ఉంటుందని సమాచారం. ఉద్యోగరీత్యా మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన జీతభత్యాలు అక్కడ కూడా ఉంటాయా మరి ప్రత్యేకించి అంతరిక్షంలో వెళ్లినందుకు అదనంగా జీతభత్యాలు చెల్లిస్తారా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
https://x.com/SpaceX/status/1902117509798465910?t=rJPT0y3N9NICVl9wnLeIkQ&s=19
అవును మీరు అనుకుంటున్నది నిజమే ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చే జీతభత్యాల కంటే వ్యోమగములకు అంతరిక్షంలో వెళ్లినప్పుడు అదనంగా జీతభత్యాలు చెల్లిస్తారు అనుకుంటే పొరపాటు. ఈ వ్యోమగాములకు ఎలాంటి అదనపు నాసా జీతభత్యాలు చెల్లించవని మాజీ వ్యోమగామి కోల్మన్ స్పష్టం చేశారు. ఈయన సమాధానంతో కొందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలకు కాస్త సమాధానం దొరికినట్లు అయింది. ఇక ఇప్పటివరకు వారు అంతరిక్షంలో ఉన్న వాతావరణ అనుకూల పరిస్థితులకు తగ్గట్లుగా భూమిపైకి వచ్చి ఉండగలుగుతారా? లేక వారికి ఏదైనా ప్రత్యేకమైన వాతావరణంలో వసతులు ఏర్పాటు చేస్తారా? అన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న కొత్త ప్రశ్న. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో ఎప్పటికప్పుడు మరింత సమాచారం మీకు అందించడానికి మా ప్రజా శంఖారావం వెబ్సైట్ ముందుంటుంది. దయచేసి మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.
Comments