Telangana Budget 2025 : ఇదీ మన రాష్ట్ర తెలంగాణ బడ్జెట్..
Telangana budget 2025 pdf , Telangana budget 2025 in telugu ,Telangana Budget allocation , Telangana Budget Highlights ,Telangana Budget Speech
By
Vaasthava Nestham
ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..
వాస్తవ నేస్తం డెస్క్ హైదరాబాద్ : 2025-26 వార్షిక బడ్జెట్ ను బుదవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందిం చారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదా యం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది.
తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలో 1000 బిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు.. రాబోయే పదేళ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్ (ట్రిలియన్ డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుందన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత క్రింద పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్ధవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు
• రైతు భరోసా - రూ.18 వేల కోట్లు
• వ్యవసాయ శాఖకు - రూ.24,439 కోట్లు
• పశుసంవర్థక శాఖకు - రూ.1,674 కోట్లు
• పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు
• విద్య - రూ.23,108 కోట్లు
• ఉపాధి కల్పన - రూ.900 కోట్లు
• పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి - రూ.31,605 కోట్లు
• స్త్రీ, శిశు సంక్షేమం - రూ.2,861 కోట్లు
• ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు
• ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు
• బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు
• మైనర్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు
• చేనేత - రూ.371 కోట్లు
• ఐటీ - రూ.774 కోట్లు
• మహిళా, శిశు సంక్షేమానికి - రూ. 2,862 కోట్లు
• హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ - రూ.150 కోట్లు
• పారిశ్రామిక రంగం - రూ.3,525 కోట్లు
• విద్యుత్ - రూ.21,221 కోట్లు
• వైద్యారోగ్యం - రూ.12,393 కోట్లు
• పురపాలక, పట్టణాభివృద్ధి - రూ.17,677 కోట్లు
• నీటిపారుదల - రూ.23,373 కోట్లు
• ఆర్ అడ్ బీ - రూ.5,907 కోట్లు
• పర్యాటక రంగం - రూ.775 కోట్లు
• సాంస్కృతిక రంగం - రూ.465 కోట్లు
• అడవులు-పర్యావరణం - రూ.1,023 కోట్లు
• దేవాదాయ, ధర్మాదాయ శాఖ - రూ.190 కోట్లు
• శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు
• ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు
• ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లు
• హోంశాఖ-రూ.10,188 కోట్లు
• క్రీడలు - రూ.465 కోట్లు
• గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం - రూ.3 వేల కోట్లు
• ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు
Comments