పాలేరు పై అడవి పంది దాడి
By
Vaasthava Nestham
• తీవ్ర గాయాలు.. రిమ్స్ కు తరలింపు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : పంట పొలంలో పాలేరు పై అడవి పంది దాడి చేసిన ఘటన సోమవారం ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అడేగామ(కే ) గ్రామానికి చెందిన బద్దం రమేష్ రెడ్డి రైతు వద్ద జైనూర్ మండలానికి చెందిన గణపతి అనే వ్యక్తి మూడు నెలల నుండి పాలేరుగా పనిచేస్తున్నారు. సోమవారం చెరువు సమీపంలో గల జొన్న పంట పొలం వద్ద ఉన్న ఎడ్లను తీసుకురావడానికి వెళ్ళాడు.
జొన్న పంట పొలంలో ఉన్న అడవి పంది అతని పైకి దూకి దాడి చేసింది. కడుపు పై తీవ్ర గాయాలు అయ్యాయి. సదరు పాలేరు కేకలు వేయడంతో పక్క పొలం లో ఉన్న పలువురు రైతులు ఒక్కసారిగా కర్రలు పట్టుకుని రావడంతో అడవి పంది పారి పోయింది. క్షతగాత్రుణ్ణి వెంటనే 108 లో అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.
Comments