విద్యార్థులపై విష ప్రయోగం
By
Vaasthava Nestham
• ఇచ్చోడ మండలంలోని ధరంపూరి ప్రాథమిక పాఠశాలలో ఘటన
• సిబ్బంది, గ్రామస్తులు అప్రమత్తతతో తప్పిన ముప్పు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: పాఠశాల విద్యార్థుల పైన విషప్రయోగం జరిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మానసిక స్థితి బాగోలేని ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై కోపంతో ఆ గ్రామంలోని విద్యార్థులపై విష ప్రయోగానికి ఒడిగట్టగా పాఠశాల సిబ్బంది గ్రామస్తుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వంట గదిలో పురుగుల మందు వాసన రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల ఆవరణలో పడి ఉన్న పురుగుల మందు డబ్బాను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు.
అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది తాగు నీటి వైపు పిల్లలను వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. మధ్యాహ్న భోజన సమయంలో ఉపయోగించే వంట పాత్రలపై పురుగుల మందు పోసినట్లు ఆనవాళ్లను గుర్తించారు. పిల్లలు తాగే మంచినీటి ట్యాంకులో విషయ ప్రయోగం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే తేరుకున్న పాఠశాల సిబ్బందితోపాటు గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.
విష ప్రయోగానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఇచ్చోడ మండలంలోని ధరంపూరి గ్రామం నందు ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు ఉండడంతో పాఠశాల పూర్తిగా మూసి వేయబడి ఉంది. వరుసగా రెండు రోజులు సెలవు. పాఠశాలలోని వంటగది తాళం పగలగొట్టబడి మధ్యాహ్నం భోజన వంట కోసం వినియోగించే పాత్రలలో తెలుపు వర్ణంతో నీరు ఉండడటం, రసాయన మందు వాసన రావడంతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయురాలు, గ్రామస్తులు అది పురుగుల మందు అని తేలడంతో.. ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు విచారణ చేపట్టి అనుమానితుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ధరంపూరి గ్రామపంచాయతీ పరిధిలోని గోండు గూడ చెందిన అనుమానితుడైన సోయం కిస్టు ని విచారించగా తానే తన సోదరుడి ఇల్లు నిర్మల్ నుండి పురుగుల మందు తీసుకొని వచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి ఇట్టి చర్యను చేపట్టినట్టు ఒప్పుకున్నాడని ఎస్సీ తెలియజేశారు. సోయం కిస్టు కుటుంబ కలహాల కారణంగా మానసికంగా ఆందోళనతో నిరాశతో ఉన్న ఉన్నదని , ఇంట్లో వారి పై కోపంతో, ఇంటి నుండి బయటకు పంపకుండా పనికి పంపకుండా ఉండడంవల్ల ఇలాంటి చర్యలకు చేపట్టినట్టు తెలిపారు. నిందితున్ని అరెస్టు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పెట్టి ఘటనపై
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలాన్ని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు ఎస్పి తెలిపారు.
Comments