వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
By
Vaasthava Nestham
• 30 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక దాడులు
• వడ్డీ వ్యాపారుల పై జిల్లా వ్యాప్తంగా 20 కేసుల నమోదు
• వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, డాక్యుమెంట్ స్వాధీనం
• జిల్లాలోని మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇటీవల బదిలీపై నూతనంగా జిల్లాకు వచ్చిన ఎస్పీ మహాజన్ పోలీస్ వ్యవస్థలలో తనదైన ముద్ర వేస్తున్నారు. అసంఘిక కార్యకలాపాలకు ఎలాంటి తావు లేకుండా ఎప్పటికి అప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ మహాజన్ పేరు వినగానే రౌడీ షీటర్లు , గ్యాంగ్లను మైంటైన్ చేసే మరికొందరు జంకుతున్నారు. జిల్లాకు బదిలీపై వచ్చిన వెంటనే పోలీసు వ్యవస్థలో పలు మార్పులు చేస్తున్నారు.
వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్..
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరిస్తూ.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వడ్డీ వ్యాపారులపై ఎస్పీ బుధవారం కొరడా జులిపించారు. జిల్లా వ్యాప్తంగా 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజలను వడ్డీ పేరుతో పిప్పి పిప్పి చేస్తున్న 20 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు సైతం నమోదు చేశారు. జిల్లాలోని మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించి వడ్డీ వ్యాపారాలు నుండి ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అఖిల్ మహాజన్ పేరు మారుమోగుతుంది. ఆకస్మిక దాడులు నిర్వహించడం రౌడీయిజాన్ని రూపుమాపడం కోసం ఎస్పీ తీసుకుంటున్న చర్యలకు భయపడి కొందరు రౌడీషీటర్లు వేరే ప్రాంతాలకు వలస వెళుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా జిల్లా పోలీస్ వ్యవస్థలో ఎస్పీ అఖిల్ మహాజన్ తనదైన మార్క్ వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఓ గ్రామంలో కొన్ని నెలల క్రితం మైనర్ బాలికను గర్భవతి చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అబార్షన్ చేయించి, ఆ యువకుడు ముఖం చాటి వేయడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ చొరవ తీసుకుంటే తమకు న్యాయం జరుగుతుందని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments