vaasthavanestham.com
Date of Publish : 26 October 2025, 9:13 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Social media post : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టితే కఠిన చర్యలు

• రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు, అరెస్టు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్సై నాగరాజు అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన లోనె సుమిత్, పజారె పవన్, కాంబ్లే ప్రషిత్‌లు ఒక పాటపై కత్తులతో దాడిచేసే వీడియోను పోస్టు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైన మతద్వేషాలను రెచ్చగొట్టే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మరణాయుధాలతో పోస్టు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సప్‌ (social media) గ్రూపుల్లో పోస్టు చేసిన వారిపై, అడ్మిన్లపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్