Gold Rate Today | బంగారం ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుండి మొదలైన పతనం ఇంకా కొనసాగుతోంది. ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ రేట్ ఏకంగా రూ.10 వేల పైనే పడిపోయింది. ఈ పతనం ఇంకా ఎక్కడివరకు కొనసాగుతుంది అన్న ఆందోళన ఇప్పటికే నగలు కొన్నవారిలో ఉంది. వెండి ధర కూడా భారీగా పడింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రూ.5,000 పైనే పడిపోయింది.
అక్టోబర్ 28న హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold Rate Today) చూస్తే స్వచ్ఛమైన బంగారం ధర తులంపై రూ.820 తగ్గి రూ.1,23,280 నుంచి రూ.1,22,460 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,13,000 నుంచి రూ.1,12,250కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్‌పై రూ.620 తగ్గి రూ.92,460 నుంచి రూ.91,840కి చేరుకుంది
వెండి ధరలు (Today silver rates)ఇవాళ భారీగా పడ్డాయి. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,65,000 ధరకు లభిస్తోంది. అక్టోబర్ 15న కిలో వెండి ధర రూ.2,07,000 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కిలో వెండి ధర రూ.42,000 పతనమైంది. మరోవైపు బంగారం ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి రూ.10 వేల పైనే పడిపోయింది.

