ఇందిరమ్మ ఏంటి నిర్మాణ బిల్లు ఇవ్వలేదని లబ్ధిదారురాలి ఆడుతాను చెట్టు కట్టేసిన కాంట్రాక్టర్
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో ఘటన
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : సొంత ఇంటి లేని పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు విడుదలవారీగా ప్రభుత్వం బిల్లును చెల్లిస్తోంది. జిల్లాలో నిరుపేదరైన కొందరు ఇంద్రమ్మ లబ్ధిదారులు ముందస్తుగా డబ్బు ఖర్చు చేసి ఇల్లు నిర్మించుకునే తోమత లేదు. ఇట్టి విషయాన్ని గ్రహించిన పలువురు కాంట్రాక్టర్ లు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి బిల్లులు వారు తీసుకుంటున్నారు. కాగా ఇంద్రమ్మ లబ్ధిదారురాలు భర్తను ఓ కాంట్రాక్టర్ ఇందిరమ్మ బిల్లు డబ్బులు ఇవ్వాలని చెట్టు కట్టేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో జరిగింది. మండలంలోని కోట (కే )గ్రామానికి చెందిన మారుతీ కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా చింతల్ బోరి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే కాంట్రాక్టర్ కు ఇల్లు నిర్మించడానికి ఇచ్చాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన మొదటి విడత గా లక్ష రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యాయి. అయితే లబ్ధిదారుడు ఇల్లు కట్టిస్తున్న కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వకుండా ఇవ్వడం లేదు అని ఆ సదరు కాంట్రాక్టర్ లబ్ధిదారురాలి భర్త మారుతీ సోనాల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో కనిపించడంతో లబ్ధిదారు రాలి భర్తను పట్టుకున్న కాంట్రాక్టర్ ఓ చెట్టుకు కట్టేశాడు. ఖాతాలో జమ అయిన డబ్బులు తనకు ఇస్తేనే వదిలి పెడతానని కాంట్రాక్టర్ దారు పట్టుబట్టాడు.
కాంట్రాక్టర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్
ఇందిరమ్మ లబ్ధిదారు రాలి భర్తను ఇందిరమ్మ బిల్లు కోసం చెట్టు కట్టేసి ఇబ్బందులకు గురిచేసిన సదురు కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఈ సందర్భంగా సోనాల మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ.. కోట (కే ) గ్రామానికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారురాలు భర్త మారుతీని చెట్టుకు కట్టివేయడం తీవ్ర అమానుషం అని, కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆడే గజేందర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.

