వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు మరియు మావోయిస్టులు పోలీసులకు వరసగా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కి (Maoist Party) దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బుధవారం 51 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. అంతేకాకుండా కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో బుధవారం 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట (Operation Kagar) చత్తీస్గడ్ అడవుల్లో భద్రత బలాలతో జల్లెడ పడుతోంది. దీంతో మావోయిస్టులు వరుసగా పోలీసులకు లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ (Maoist Party) కి చెందిన కీలక నేతలతో పాటు మావోయిస్టులు సైతం లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈనెల 28వ తేదీన పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్‌లు లొంగిపోయారు. తెలంగాణ ఎస్‌ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్‌లో ఈ ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ (Maoist Party) లో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) సక్సెస్ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఎన్నో సంవత్సరం ఎన్నో సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు పోరాటాలు చేసి చివరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ కగార్ వలన పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
కదండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (Operation Kagar) మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనేది అంగీకరించాల్సిన విషయం. ఇలా వరుసగా మావోయిస్టుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.

