వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : దీపావళి నుండి వరుసగా బంగారం , వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు ఒక విధంగా నష్టమైతే మరో పక్క కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.1,910 తగ్గి రూ.1,22,400 నుంచి రూ.1,20,490కి చేరింది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,12,200 నుంచి రూ.1,10,450కి చేరింది. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,430 తగ్గి రూ.91,800 నుంచి రూ.90,370కి తగ్గింది దీంతో బిజినెస్ మార్కెట్ లో బంగారం ధర తగ్గుదలపై చర్చలు జరుగుతున్నాయి.
వెండి ధర సైతం తగ్గుముఖం పడుతుంది. అక్టోబర్ 30న కిలో వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,65,000కి చేరింది. అక్టోబర్ 15న కిలో వెండి రూ.2,07,000 ఉండగా, అప్పటి నుంచి రూ.42,000 తగ్గిపోయింది. మొత్తంగా ఆల్‌టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధర రూ.12 వేలకుపైగా తగ్గిపోయింది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.20 శాతం అంటే రూ.236 తగ్గి రూ.1,20,430 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.11 శాతం అంటే రూ.163 తగ్గి రూ.1,45,918 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4000 డాలర్ల కంటే తక్కువగా, సుమారు 3976 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి ధర 47.84 డాలర్ల దగ్గర ఉంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యల తర్వాత బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఈ పరిణామం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బుధవారం ఫెడరల్ రిజర్వ్ తన పాలసీ సమావేశం ముగిసిన తర్వాత వడ్డీ రేటు పావు శాతం తగ్గించింది. కానీ భవిష్యత్తులో ఆర్థిక విధానం పై ఏకాభిప్రాయం సాధించడం కష్టమని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో మరోసారి వడ్డీ రేటు తగ్గుతుందని భావించకూడదని ఆయన హెచ్చరించారు.
మార్కెట్లలో పెరిగిన కొనుగోలుదారుల తాకిడి..
ఫెడరల్ రిజర్వ్ చేసిన ఈ కామెంట్స్, డిసెంబర్‌లో వడ్డీ తగ్గింపు అవకాశం తగ్గించడం బంగారానికి ప్రతికూలంగా మారిందని విశ్లేషకుడు కైల్ రోడా రాయిటర్స్‌కి తెలిపారు. ఇలా కొనసాగితే బంగారం ధర కొంతకాలం తగ్గే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో బంగారం మళ్లీ పెరుగుతుందనే ధోరణి ఉంటుందని ఆయన చెప్పారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గురువారం జరిగే తన పాలసీ సమావేశంలో వడ్డీ రేటును అలాగే ఉంచే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. బంగారం వెండి ధరల ఈ మార్పు సాధారణ ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతుంది. ఇలా దీపావళి నుండి బంగారం బంగారం వెండి ధరలు తగ్గుముఖం పక్కడంతో దగ్గు ముఖం పక్కడంతో మార్కెట్లో బంగారం వెండి కొనుగోలులు పెరిగాయి. దీంతో హైదరాబాద్ , ముంబై వంటి మార్కెట్ లలో పెద్ద ఎత్తున రద్దీనెలకొంది.

