వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో NH-44 రహదారిపై చెట్లమల్లాపురం గ్రామం దగ్గర అక్టోబర్ 24, 2025 (శుక్రవారం) తెల్లవారుజామున సుమారు 3 గంటలకు జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ (V Kaveri Travels) ప్రైవేట్ స్లీపర్ బస్ ప్రమాదంలో మొత్తం 20 మంది మరణించారు. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bangalore bus accident) వెళ్తున్న లగ్జరీ బస్ లో 41 మంది ప్రయాణికులు ఉండగా, మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు, 1 మంది బైకర్ చనిపోయారు. మిగిలినవారు గాయపడ్డారు.
Kaveri travels bus accident | ప్రమాదం ఇలా జరిగింది..!?
బైకర్ ప్రమాదం : మద్యం మత్తులో బి.శివశంకర్ (బైకర్) తన స్నేహితుడు ఎర్రిస్వామి తో కలిసి స్టంట్లు వేస్తూ NH-44 లో వెళ్తున్నాడు. CCTV ఫుటేజ్ లలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ ప్రమాదానికి గురై , రోడ్డు మధ్యలో పడిపోయింది. శివశంకర్ అక్కడే మరణించాడు, ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
Kurnool bus accident | బస్ ఢీ కొట్టడం : ఆ క్షణంలో వచ్చిన కావేరి ట్రావెల్స్ (Kaveri travels) బస్ డ్రైవర్ లక్ష్మయ్య బైక్‌ను ఢీకొట్టి 300-400 మీటర్లు ట్రాగ్ చేశాడు. బైక్ బస్సు (Kaveri travels bus owner Vemiri Kaveri)కింద చిక్కుకుని, పెట్రోల్ లీక్ అయింది. స్పార్క్ లతో మంటలు చెలరేగాయి.
మంటలు వ్యాప్తి : బస్సులో అనధికార బ్యాటరీలు,400కి పైగా మొబైల్ ఫోన్లు లాంటి కార్గో ఉండటంతో మంటలు వ్యాపించాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు బ్లాక్, ఫైర్ఎక్స్‌టింగ్విషర్లు పనిచేయకపోవటం వల్ల ప్రయాణికులు బయటపడలేకపోయారు. చాలామంది నిద్రలో ఉండటంతో రక్షించుకోలేకపోయారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులు మరియు వారి గుర్తింపు :
19 మృతదేహాలు DNA టెస్టులతో గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. FSL రిపోర్ట్ ప్రకారం బైకర్ శివశంకర్ మద్యం తాగి ఉన్నాడని కన్ఫర్మ్ చేసారు. బస్ డ్రైవర్ లక్ష్మయ్య, కావేరి ట్రావెల్స్ ఓనర్ (Kaveri travels owner) ఓనర్లను అరెస్ట్ చేశారు. డ్రైవర్ ఆగకుండా వెళ్లడం, బస్ సేఫ్టీ లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (deputy CM Pawan Kalyan) స్థలాన్ని సందర్శించారు. రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయం ప్రకటించారు.
Kaveri travels bus accident | కర్నూలు బస్ ప్రమాదం | మరణించినవారి కుటుంబాల వివరాలు :
అక్టోబర్ 24న జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 20 మంది మరణించారు (బస్సులో 19, బైకర్ 1). డీఎన్‌ఏ టెస్టులతో అందరినీ గుర్తించి, 19 మృతదేహాలు కుటుంబాలకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ సిరి పర్యవేక్షణలో మృత ధ్రువీకరణ పత్రాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. పూర్తి మృతుల జాబితా అధికారికంగా ప్రకటించకపోయినా, హైలైట్ అయిన కుటుంబాల వివరాలు..ఇక్కడ :
నెల్లూరు గోళ్ల రమేశ్ కుటుంబం (ఒకే కుటుంబం నలుగురు మృతి)
1) గోళ్ల రమేశ్ (35) : బెంగళూరులో హిందుస్థాన్ కంపెనీలో ఉద్యోగం. తన అక్క కూతురు అనూషను వివాహం చేసుకున్నారు.
2) అనూష (32) : రమేశ్ భార్య (టీడీపీ కార్యకర్త) 3) యశ్వంత్ (కుమారుడు,8)
4) మన్విత (కూతురు, 6) నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, గోళ్లవారిపల్లి. (దీపావళికి హైదరాబాద్ వెళ్లి బెంగళూరు తిరిగి వస్తుండగా ప్రమాదం. అనూష తన కూతురు మన్వితను కౌగిలి కాపాడటానికి ప్రయత్నించి కాలిపోయారు. గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయం ప్రకటించారు. TDP ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు క్లియర్ చేసింది.)
మెదక్ తల్లీ-కూతురు :
5) మంగ సంధ్యారాణి (43)
6) చందన్ (23) : బెంగళూరులో ఉద్యోగం. (కుటుంబం : భర్త వేణు ఆనంద్ గౌడ్ (దుబాయ్), కుమారుడు శ్రీవల్లభ్ (అలహాబాద్ చదువు). మెదక్ జిల్లా, శివాయిపల్లి. దీపావళికి ఇంటికి వచ్చి, చందన్‌ను బెంగళూరు డ్రాప్ చేసి దుబాయ్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అంబులెన్స్‌లో శవాలు గ్రామానికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహాయం చేశారు.)
బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు (ఇద్దరు) :
7) అనూష రెడ్డి : యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, వస్తకొండూరు.
8) గన్నమనేని ధాత్రి (27) : బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలం, పూసపాడు ( దీపావళికి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం. హైదరాబాద్‌లో మేనమామ దగ్గర బస్సు ఎక్కారు).
ఇతర ముఖ్య మృతులు :
9) త్రిమూర్తులు : చిత్తూరు జిల్లా, యామగానిపల్లి. కుమారుడు భరత్ కు శవం అప్పగించారు. (19వ గుర్తింపు)
10) ప్రశాంత్ : తమిళనాడు.
11) అమృత్ కుమార్ (48) : బిహార్. కుటుంబం నిర్ణయంతో కర్నూలులో దహనం.
12) బెంగళూరు తల్లీ-కుమారుడు : వివరాలు పూర్తి కావు.
13) బైకర్ బి. శివశంకర్ : మద్యం తాగి స్టంట్స్ వేస్తూ ప్రమాదం.

