వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్ హైదరాబాద్ నుండి బెంగళూరు (Hyderabad to Bangalore Bus Accident) వెళ్తున్న క్రమంలో కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురి అయింది ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri travels) యజమాన్యం బాధిత కుటుంబ సభ్యులకు అందజేసింది.
ఈ మేరకు 2025, అక్టోబర్ 30వ తేదీన 40 లక్షల రూపాయల చెక్కును కర్నూలు కలెక్టరేట్ లో అందజేశారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి ₹50 వేల సహాయాన్ని అందజేశారు. గురువారం కలెక్టరేట్ లో ఈ చెక్కును ఏపీ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అందించారు. బాధితులకు ఈ సాయాన్ని అందించాలని కోరారు.

