మూత్ర విసర్జనకు వెళ్ళొస్తానని జంప్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లాలోని సోనాల మండలంలో కాంట్రాక్టర్ (Contractor) సత్యనారాయణ తాను నిర్మించిన ఇందిరమ్మ (indrama house construction) ఇల్లు, బిల్లు ప్రభుత్వం నుండి విడుదలైన కూడా డబ్బులు ఇవ్వలేదు అని ఇందిరమ్మ లబ్ధిదారురాలి భర్తను బిల్లు కోసం చెట్టుకు కట్టేసి దాస్టికానికి గురిచేసిన సంఘటన జిల్లాలో పెద్దవెత్తున చర్చనీయాంశమైంది. ఇట్టి ఘటనపై జిల్లా కలెక్టర్ రాజార్షి షా స్పందిస్తూ సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేసినట్లు పత్రిక ప్రకటనలు తెలిపారు. కాగా కాంట్రాక్టర్ సత్యనారాయణ కేసు నమోదు చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ (police station) కు తరలించారు. కాంట్రాక్టర్ (contractor) అదే రాత్రి మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని పోలీస్ స్టేషన్ నుండి పరారయ్యాడు. ఇట్టి ఘటన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

