ప్రపంచంలోని దేశాలలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారతదేశం గా చెప్పుకొస్తారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త. చాలా రోజుల తర్వాత కిందటి రోజు పెరిగిన బంగారం ధర ఇవాళ మళ్లీ తగ్గుముఖం పట్టింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన క్రమంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం గోల్డ్ , సిల్వర్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.
Gold Price in Hyderabad: ముఖ్యంగా భారతీయ మహిళలు ఎక్కువగా పండగలు, వివాహాలు సహా ఇతర శుభకార్యాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీపావళి కంటే ముందు రోజుల్లో బంగారం ధర ఆకాశం నీ అంటే మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనడం కలగానే భావించారు. కానీ దీపావళి మరుసటి రోజు నుండి బంగారం , వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పెండ్లి ముహూర్తాలు ఖరారైతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారు అభరణాలు అధికంగా భారతదేశంలో వినియోగిస్తుంటారు. అదేవిధంగా బంగారంలో పెట్టుబడికి కూడా మంచి సాధనంగా వాడుతున్నారు. బంగారంతో పాటుగానే వెండిలోనూ పెట్టుబడి పెడుతుంటారు. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో.. బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. వీటిపై పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కూడా వచ్చాయి. అస్థిరత కాస్త తగ్గగా.. గత 10 రోజుల్లో భారీగా దిగొచ్చింది.
Gold Purchasing | బంగారం కొనుగోలులో ఎక్కువ ఆసక్తి చూపేది భారతీయులే :
బంగారం కొనుగోలులో ఎక్కువ ఆసక్తి చూపేది భారతీయులే.. బంగారం ధర (24 Carat Gold) కొద్దికొద్దిగా తగ్గుతున్న క్రమంలో బంగారు కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. కిందటి రోజు పెరిగిన బంగారం ధరలు .. దేశీయంగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరం లో చూస్తే ప్రస్తుతం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 850 తగ్గింది. దీంతో తులం ఇప్పుడు రూ. 1,11,350 కి దిగొచ్చింది. కిందటి రోజు మాత్రం రూ. 1450 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 920 పతనంతో 10 గ్రాములకు రూ. 1,21,480 కి పడిపోయింది. బంగారం ధరల బాటలోనే వెండి ధర కూడా దిగొచ్చింది. కిందటి రోజు రూ. 1000 పెరగ్గా.. మళ్లీ అదే ఇవాళ తగ్గింది. దీంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1.65 లక్షలు పలుకుతోంది. దేశీయంగా ఇలా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా మాత్రం ధరలు పుంజుకున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 4035 డాలర్ల స్థాయికి చేరింది. సిల్వర్ ధర మళ్లీ 49 డాలర్ల మార్కు దాటేసింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడం ఇందుకు కారణమైంది. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర తగ్గుతుంటుందని చెప్పొచ్చు. ఒకపక్క డాలర్ విలువ పెరుగుతూ ఉంటే బంగారం ధర క్రమక్రమంగా తగ్గుతుంది అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తు
న్నారు.

