vaasthavanestham.com
Date of Publish : 29 October 2025, 8:52 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ACB ride | ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్

వాస్తవ నేస్తం, వెబ్ డెస్క్ : కరెంట్ మీటర్ మార్చడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (electricity assistant engineer) ఏసీబీకి (ACB ride) చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్‌ లో కరెంట్ మీటర్ మార్పిడి కోసం రూ.6 వేలు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డిమాండ్ చేశారు. సదరు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసిబి అధికారుల పథకం ప్రకారం రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ని ఏసీబీ (ACB Anti-Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. తీసుకుంటూ పట్టుబడిన ప్రభు లాల్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్