vaasthavanestham.com
Date of Publish : 11 December 2025, 5:56 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gp Elections Echoda | ఇచ్చోడలో ఓటింగ్ సరళి తీరును పరిశీలించిన కలెక్టర్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాల పరిశీలన సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచనలు. ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు, ఓటర్ల సౌకర్యాలపై సమాచారం సేకరించి, పలు సూచనలు ఇచ్చారు.పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిందిగా కలెక్టర్ సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల పాటింపు అత్యంత ముఖ్యం అని తెలిపారు. ఈ పరిశీలనలో ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా, రిటర్నింగ్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్