vaasthavanestham.com
Date of Publish : 11 October 2026, 3:07 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

హిందీ క్విజ్ పోటీలో ‘ఆదిలాబాద్ జిడిసి’ విద్యార్థుల ప్రతిభ

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : విశ్వ హిందీ పరివార్, భారతీయ భాషా వేదిక, దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ హిందీ క్విజ్ పోటీ–2026లో ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్) విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.  ( Adilabad GDC Students Hindi Quiz )జాతీయ హిందీ దివోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహించిన ఈ పోటీల్లో కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. శనివారం (అక్టోబర్ 10న) ఫలితాలు వెలువడటంతో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా ప్రశంసాపత్రాలను అందజేశారు.

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. సంగీత, హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాథోడ్ శ్రావణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాలను నిరూపించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇలాగే ఉత్సాహంతో పాల్గొని కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్