vaasthavanestham.com
Date of Publish : 15 May 2026, 10:17 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం: విద్యా వారోత్సవాల్లో విద్యార్థుల వినూత్న ప్రచారం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం, కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల విద్యార్థులు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రైతు బజార్, మరియు ఇతర రద్దీగా ఉండే ప్రజా ప్రదేశాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మూగజీవాలకు కలిగే హానిని వివరిస్తూ విద్యార్థులు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, వస్త్ర సంచులు, పర్యావరణహిత వస్తువులను వాడాలని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, సహాయ ఆచార్యులు రాథోడ్ శ్రావణ్మా ట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకురావడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, ఇలాంటి సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనీల్, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉత్సాహం, ప్రజల స్పందనతో ఈ అవగాహన ర్యాలీ విజయవంతమైంది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్