vaasthavanestham.com
Date of Publish : 08 February 2026, 6:45 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Andhra Pradesh | ఏపీ ప్రజలకు శుభవార్త: భారీగా పెరిగిన పెళ్లి కానుక, ప్రసూతి సాయం.. జూన్ కల్లా సొంత ఇల్లు!

సామాన్యుల కోసం పాత పథకాలను పునరుద్ధరించిన ప్రభుత్వం.. ఆ అకౌంట్లలోకి నగదు జమ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు గతంలో నిలిపివేసిన అత్యంత ఆదరణ పొందిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు, రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పేద మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది.

కార్మికులకు అండగా కొత్త ప్రయోజనాలు :

అసంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ కింది పథకాలను మళ్ళీ అమల్లోకి తెచ్చింది:

ప్రసూతి సాయం: మహిళా కార్మికులకు ప్రసవ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 20,000 కు పునరుద్ధరించారు.

వివాహ కానుక: కార్మికుల కుటుంబాల్లో జరిగే వివాహాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 40,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాల వల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభించనుంది.

2.61 లక్షల ఇళ్లు.. జూన్ 2026 నాటికి పూర్తి!

ఇల్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మొత్తం 2.61 లక్షల ఇళ్లను జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రూ. 4,451 కోట్ల మేర రుణాన్ని సేకరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో, పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ సంక్షేమ పథకాల అమలుతో పేద మధ్యతరగతి కుటుంబ సభ్యుల సొంతింటి కల నెరవేరడంతో పాటు వారి కష్టాలు తీరని ఉన్నాయి.

Note: Images used in this article are generated by AI for representation purposes.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్