vaasthavanestham.com
Date of Publish : 12 October 2026, 8:08 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Advocate Sudheer Kumar | 289వ వారానికి చేరిన నిరంతర సేవ

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రారంభమైన ఉచిత అన్నదాన కార్యక్రమం నేటికీ నిరంతరాయంగా కొనసాగుతూ ఆదివారం నాటికి 289వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమానికి ప్రజాదరణ, జన నీరాజనం లభించాయి.

ఈ వారపు అన్నదాన కార్యక్రమానికి దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా పేదలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడూ.. కరోనా విపత్తు కాలం నుంచి ఇప్పటివరకు ఒక్క వారం కూడా విరామం లేకుండా నిరంతరాయంగా 289 వారాల పాటు అన్నదానం ( Annadhanam ) నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి నిరుపేదలకు అండగా నిలుస్తున్న నిర్వాహకుల సేవా నిరతిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది డాక్టర్ సుధీర్ కుమార్ సంగెం , సింగం, విశ్రాంత ఉపాధ్యాయులు అంబయ్య, రాజయ్య, గణేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్