vaasthavanestham.com
Date of Publish : 14 May 2026, 3:28 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ఇచ్చోడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఆసిఫుల్లా ఖాన్ నియామకం

• ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆసిఫుల్లా ఖాన్ (ఆసిఫ్ ఖాన్) నియమితులయ్యారు. ఈ మేరకు మే 13న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ సిఫార్సుల మేరకు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ నియామకానికి ఆమోదం తెలుపుతూ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ అధికారికంగా వెల్లడించారు. బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా పది మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ అధిష్టానం జాబితాను విడుదల చేయగా, అందులో ఇచ్చోడ మండల పగ్గాలను ఆసిఫుల్లా ఖాన్‌కు అప్పగించారు. పార్టీని క్షేత్రస్థాయి మరింత బలోపేతం చేసే దిశగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అంకితభావంతో కృషి చేయాలని టీపీసీసీ ఈ సందర్భంగా ఆకాంక్షించింది. ఇచ్చోడ మండల అధ్యక్షుడిగా ఆసిఫుల్లా ఖాన్ నియామకం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డాక్టర్ నరేష్ జాదవ్ నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ మరింత పుంజుకుంటుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Official TPCC order copy detailing the appointment of new Congress Mandal Presidents for Boath Assembly Constituency
Official order issued by TPCC President B. Mahesh Kumar Goud announcing the newly appointed Mandal Presidents for Boath constituency.
క్ర.సం. మండలం / టౌన్ నూతన అధ్యక్షుడి పేరు
1 భీంపూర్  సుదర్శన్
2 తలమడుగు  కాసుల ప్రతాప్
3 తాంసి  కౌడల సంతోష్
4 సిరికొండ  షేక్ ఇమామ్
5 బజార్‌హత్నూర్  కల్లెం విఠల్
6 ఇచ్చోడ  ఆసిఫుల్లా ఖాన్(ఆసిఫ్ ఖాన్)
7 నేరడిగొండ  ఆలేటి రాజశేఖర్ రెడ్డి
8 బోథ్  నల్ల శ్రీకాంత్ రెడ్డి
9 గుడిహత్నూర్ తొడసం దౌలత్ రావు
10 సోనాల గాజుల పోతన్న

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్