vaasthavanestham.com
Date of Publish : 05 January 2026, 2:14 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Online Gold Loan | ఈఎంఐ ఎంత ఉండాలి.? ఆన్‌లైన్ బంగారంపై లోన్ వస్తుందా..? మీకోసమే ఈ కీలక అప్డేట్స్..

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో లోన్లు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టమైన అవగాహన చాలా అవసరం. చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. అందుకే సాధారణంగా చాలామందికి ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన ఆర్థిక సందేహాలపై స్పష్టత తెలుసుకోవడం అవసరం.

గృహ రుణం తీసుకునేటప్పుడు ఈఎంఐ ఎంత ఉండాలన్నది కీలకమైన అంశం. సాధారణంగా నెలవారీ ఆదాయంలో 30 శాతం లోపే ఈఎంఐ ఉంటే ఆర్థికంగా సురక్షితమని నిపుణులు సూచిస్తారు. ఇది 35 నుంచి 40 శాతం వరకు వెళ్లినప్పుడు నెలవారీ ఖర్చుల నిర్వహణ కష్టమవుతుంది. 40 శాతం మించిన ఈఎంఐ అయితే రోజువారీ అవసరాలు, మెడికల్ లేదా ఉద్యోగ సంబంధిత అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కష్టం కావచ్చు. అయితే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే, కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ నిధి ఉంటే, ఇతర రుణాలు లేకపోతే మాత్రం కొంచెం ఎక్కువ ఈఎంఐను కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది.
బ్యాంకింగ్ విషయానికి వస్తే, భార్యాభర్తలు కలిసి జాయింట్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓపెన్ చేయవచ్చు. అయితే వడ్డీపై పన్ను ప్రయోజనాలు మాత్రం ఫస్ట్ హోల్డర్‌కే వర్తిస్తాయి. ఎఫ్‌డీ తెరిచేటప్పుడు విత్‌డ్రా చేయడం, రెన్యూవల్ చేయడం వంటి హక్కులు ఇద్దరిలో ఎవరికైనా ఉండేలా స్పష్టంగా ఎంపిక చేసుకోవడం మంచిది. ఇద్దరిలో ఒకరు సీనియర్ సిటిజన్ అయితే వారినే ఫస్ట్ హోల్డర్‌గా పేర్కొంటే కొంత ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బంగారంపై లోన్ పొందవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో కాయిన్లు లేదా ఆభరణాల రూపంలో కొనుగోలు చేసిన బంగారాన్ని తనఖా పెట్టుకోవచ్చు. అయితే అది 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగి ఉండాలి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరి. హాల్‌మార్క్ ఉంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సులభంగా అంగీకరిస్తాయి. కొన్ని బ్యాంకులు నిబంధనల్లో కఠినంగా ఉన్నా, ఎన్‌బీఎఫ్‌సీలు వేగంగా రుణం అందిస్తాయి.

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఖాతా తెరవాలంటే సిబిల్ స్కోరు అవసరం లేదు. 18 ఏళ్లు నిండినవారు పాన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్‌తో ఖాతా ఓపెన్ చేయవచ్చు. అయితే ఎఫ్‌అండ్‌ఓ లేదా డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేయాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి.

Illustration showing home loan EMI planning, gold loan concept, and personal finance management.
Understanding the right EMI limit and gold loan rules can help you make smarter financial decisions.

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టేవారు దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగాలి. ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలు ఆశించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోదని అనిపిస్తే టాప్-అప్ పాలసీ ఒక మంచి ఎంపిక కావచ్చు. అయితే మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

– Qamar SD

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్