నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. ఇచ్చోడ మండలానికి చెందిన వ్యక్తి అరెస్ట్
• 150 ‘మౌళి 5G’ ప్యాకెట్లు, ఎర్టిగా కారు స్వాధీనం • గుజరాత్ నుంచి తీసుకొచ్చి విక్రయాలకు యత్నం వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వ్యవహారం రట్టయ్యింది. గుజరాత్ నుంచి అక్రమంగా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అమాయక రైతులకు అంటగట్టేందుకు యత్నించిన ఇచ్చోడ మండలానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలను కారులో తరలిస్తున్న నిందితుడిని...