వాస్తవ నేస్తం,ఇచ్చోడ: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా మాదాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అక్టోబర్ 2న జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా Madhapur Gram Panchayat సర్పంచ్ శ్రీ షేక్ ఇమ్రాన్ షాదుల్లా ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మరియు సేవా భావాలను జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ Gandhi Jayanti Celebrations సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతాన్ని నిర్మించడానికి Swachh Bharat సూత్రాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను ఒక బాధ్యతగా చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు , గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!