vaasthavanestham.com
Date of Publish : 22 October 2025, 7:14 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gold Price : రూ. 6 వేలు త‌గ్గిన బంగారం

వాస్తవ నేస్తం,హైద‌రాబాద్ : సామాన్యుడికి అంద‌కుండా కొండెక్కి కూర్చున్న ప‌సిడి ఒక్క‌సారిగా దిగొచ్చొంది. ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా రూ. 6 వేలు త‌గ్గింది.

Gold Price : ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,28,15022 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ద‌ర రూ. 1,17, 500 ప‌లుకుతోంది.

కిలో వెండి రూ. 1,65,000కు చేరుకుంది. కాగా సామాన్యుడు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న ప‌సిడి ఒక్క‌సారిగా త‌గ్గింది. మంగ‌ళ‌వారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ. 6 వేలు త‌గ్గింది. రికార్డు స్థాయిలో కొండెక్కి కూర్చున్న ప‌సిడి ఒక్క‌సారిగా ఆరు వేలు త‌గ్గ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి అమెరికా డాల‌ర్ బ‌లోపేతం కావ‌డం, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు కొంత స‌ద్దుమ‌న‌గ‌డం కూడా కార‌ణ‌మ‌ని ప‌లువురు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్