పసిడి ధరలకు బ్రేక్ లేదా..? 2026 నాటికి 10 గ్రాముల బంగారం రూ.2 లక్షల దిశగా దూసుకెళ్తుందా..!

బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆభరణాల కొనుగోలు పండుగలకే పరిమితమైతే, ఇప్పుడు బంగారం పేరు వినగానే సామాన్యుడికి గుబులు మొదలవుతోంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ నివేదిక పసిడి భవిష్యత్తుపై మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. వాల్ స్ట్రీట్‌కు చెందిన దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరుగుతున్న సురక్షిత పెట్టుబడి డిమాండ్ కారణంగా 2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్ల స్థాయికి చేరే అవకాశముందని పేర్కొంది. భౌగోళిక...