vaasthavanestham.com
Date of Publish : 31 December 2025, 7:54 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gold & Silver Prices | బంగారం ధరలతో తలనొప్పులు..!!

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ఇన్ని రోజులూ ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో ఇప్పుడు డౌన్‌ఫాల్ మొదలైంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన బంగారం రేట్లు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి.

ఈ తగ్గుదల వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. నేటి ధరలు కూడా కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా
ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగొచ్చని చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :

నగరం 24 క్యారెట్లు (₹) 22 క్యారెట్లు (₹)
ఢిల్లీ 1,35,570 1,24,273
ముంబై 1,35,800 1,24,483
కోల్‌కతా 1,35,620 1,24,318
చెన్నై 1,36,200 1,24,850
బెంగళూరు 1,35,910 1,24,584
హైదరాబాద్ 1,36,020 1,24,685

 

ఇక వెండి ధరలను పరిశీలిస్తే, కిలో వెండి రేట్లు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో 999 స్వచ్ఛత కలిగిన వెండి ధరలు ఇలా ఉన్నాయి :

నగరం కిలో వెండి ధర (₹)
ఢిల్లీ 2,33,340
ముంబై 2,33,750
కోల్‌కతా 2,33,440
చెన్నై 2,34,430
బెంగళూరు 2,33,930
హైదరాబాద్ 2,34,120

 

ప్రధాన నగరాల్లో గ్రాముకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :

నగరం 24 క్యారెట్లు (₹) 22 క్యారెట్లు (₹) 18 క్యారెట్లు (₹)
చెన్నై 13,691 12,550 10,470
ముంబై 13,588 12,455 10,191
బెంగళూరు 13,620 12,485 10,193


గమనిక: పై ధరలు ఉదయం సమయంలో ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగా ఇవ్వబడ్డాయి. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు కలిపితే ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని బంగారం వ్యాపారులను సంప్రదించడం మంచిది.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్