vaasthavanestham.com
Date of Publish : 26 January 2026, 11:24 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gold Price : తగ్గినట్టే కనిపిస్తున్న బంగారం ధరలు… కానీ ఇప్పుడే కొనాలా..? నిపుణులు ఏమంటున్నారు..?

తగ్గినట్టే తగ్గి అమాంతం పెరుగుతున్న బంగారం ధరలు ప్రపంచంఆర్థిక మార్కెట్ని కుదిపి వేస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో పసిడి ధరలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుండగా, దేశీయ మార్కెట్‌లో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే ఈ తగ్గుదల పెట్టుబడిదారులకు నిజంగా ఊరట కలిగించే అంశమా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ సంబంధిత నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. జియోపాలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. సేఫ్ హెవెన్‌గా పసిడి మీద పెట్టుబడులు పెరగడంతో అంతర్జాతీయంగా ధరలు ఎగబాకుతున్నాయి.

జనవరి 26, సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలను పరిశీలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.16,025 వద్ద, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.14,689 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.12,018గా నమోదైంది. 100 గ్రాముల బంగారం ధరల్లోనూ అన్ని క్యారెట్లకు రూ.100 మేర తగ్గుదల కనిపించింది.

📢 హైదరాబాద్‌లో బంగారం ధరలు పడిపోయాయా?
ఈరోజు 22K & 24K తాజా రేట్లు చూడండి. కొనుగోలు ముందు తప్పక చెక్ చేయండి!


👉 Live Gold Rates చూడండి

హైదరాబాద్ నగరంతో పాటు విజయవాడలోనూ బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,250గా, 22 క్యారెట్ల ధర రూ.1,46,890గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,180గా నమోదైంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ పెద్ద మార్పులేమీ లేకుండా ధరలు కొనసాగుతున్నాయి. ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ ఇప్పుడే కొనుగోలు చేయడంపై నిపుణులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఇంకా గరిష్ఠ స్థాయిలోనే ఉండటం, రానున్న రోజుల్లో డాలర్ కదలికలు మరియు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు.

బంగారం ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలిక పరిణామమే కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కన్నా, దశలవారీగా పెట్టుబడి పెట్టడం సురక్షిత మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 26, 20 25 | 11:20 AM

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్