vaasthavanestham.com
Date of Publish : 24 October 2026, 10:13 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

మిషన్ భగీరథ నీటిలో మురికి.. పురుగులు!

• భీమన్న కాలనీలో తాగునీటి సరఫరాపై ఆందోళన

• అధికారుల నిర్లక్ష్యంపై నాయకులు, స్థానికుల అసహనం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లాలోని నేరగొండ మండల కేంద్రంలోని భీమన్న కాలనీలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో మురికితో పాటు కీటకాలు, పురుగులు (Mission Bhagiratha Contaminated Water) వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పథకంలో ఇలాంటి నీరు సరఫరా కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

కాలనీలోని కుళాయిల ద్వారా వస్తున్న కలుషిత నీటిని చూసి ప్రజలు తాగేందుకు భయపడుతున్నారు. మురికి పదార్థాలతో పాటు కీటకాలు వస్తున్న దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోల రూపంలో చూపిస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

అధికారులు వెంటనే స్పందించాలి: సబ్లే సంతోష్

ఈ సమస్యపై నాయకులు సబ్లే సంతోష్ స్పందిస్తూ.. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని మండిపడ్డారు. మిషన్ భగీరథ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్