vaasthavanestham.com
Date of Publish : 29 October 2025, 10:39 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం బంగారం ధర ఏకంగా రూ.13 వేలు పతనం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : గత కొన్ని నెలల నుండి బంగారం ధర పెరుగుతూ పెరుగుతూ చివరికి ఆకాశం లాంటి ఆకాశాన్ని అంటి మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనడమే గాగనమైంది. అమాంతం పెరిగిన బంగారం ధర గత వారాలు రోజుల నుండి తగ్గుముఖం పట్టింది. బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. గారం ధర భారీగా పడిపోయింది.  గత వారం రోజుల నుండి బంగారం ధర తులానికి రూపాయలు 13000 తగ్గింది.

బంగారం ధర ఆల్ టైం రికార్డ్ (all time record) స్థాయి అయినా 1.32 లక్షల రూపాయల నుంచి తగ్గడం గమనించవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,370  చేరింది. ఒక తులం (11.664 గ్రాములు) బంగారం ధర రూ. 1,37,520 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల (22 carat gold) ఆర్నమెంట్ బంగారం ధర రూ. 1,12,650 పలుకుతోంది. మరోవైపు ఒక కేజీ వెండి ధర రూ. 1,48,300 పలుకుతోంది. బంగారం (Gold ) ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.

ఆగ్రరాజ్యమైన అమెరికాలో (America) ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర అక్టోబర్ నెలలోనే ఒక ఔన్స్ ధర 4396 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం బంగారం ధర ఒక ఔన్స్ 3970 డాలర్లకు పతనం అయ్యింది. అంటే దాదాపు 400 డాలర్ల పైనే తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా స్టాక్ (stock market) మార్కెట్లు పుంజుకోవడంతో పాటు, డాలర్ విలువ పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరకు స్టాక్ మార్కెట్ కి అనుహ సంబంధం ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు, ఇతర కారణాల వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఇతర స్టాక్ మార్కెట్ల వైపు తరలిస్తున్నానరు. దీనికి తోడు బంగారం నుంచి ఇన్వెస్టర్లు ప్రాపిట్ బుకింగ్ చేయడం కూడా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుముఖం పడుతుంది. అమెరికా (China) చైనా మధ్య రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో ఒప్పందం కుదరనుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో (stock market) పాజిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక వెండి విషయంలో భారీగా తగ్గుదల నమోదు అవుతోంది. వెండి ధర దాదాపు 25 శాతం మేర తగ్గినట్లు గమనించవచ్చు. ఆల్ టైం రికార్డ్ స్థాయిని రెండు లక్షల రూపాయల నుంచి వెండి ధర 1.50 లక్షల రూపాయల దిగువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో వెండి ధర భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వెండిలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా భారీ ర్యాలీ చోటు చేసుకుందని, ప్రస్తుతం కనిపిస్తున్న కరెక్షన్ ఒక టెక్నికల్ కరెక్షన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకేసారి అమౌంట్ పెరిగిన బంగారం ధర గత వారం రోజుల నుండి వరుసగా తగ్గుతూ వస్తుండడంతో భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్