vaasthavanestham.com
Date of Publish : 12 January 2026, 8:45 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

పండగ ముందు బంగారం & వెండి ధరలు ఆకాశానికి ఎగిసి కొత్త రికార్డులు!

Gold Rate Hike: ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరుగుతుండటంతో మధ్యతరగతి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా 2026 కొత్త సంవత్సరంలో ధరలు తగ్గుతాయని ఆశపడ్డ వాళ్లకి పసిడి షాక్ ఇస్తోంది.

పండుగలు వచ్చినయ్, పొద్దున లేస్తే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది, అందరూ ఎదురు చూస్తుంటే.. పసిడి ధరలు మాత్రం ఆకాశానికి నిచ్చెన వేస్తున్నయ్. కొత్త సంవత్సరం వేళ ధరలు కొంచెం తగ్గుతాయ్ అనుకుంటే, సీన్ రివర్స్ అయి మళ్లీ పైకి పోతున్నయ్.

నేడు బంగారం ధరలు ఇలా: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,150 వద్దగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 వద్ద ఉంది. ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,690 పెరిగింది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, దేశీయ డిమాండ్ పెరుగడం. 2026 ప్రారంభంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. అమెరికా-వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు పెట్టుబడిదారులను బంగారం వైపుకు మళ్లించాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,150, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,300 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ, ఢిల్లీలోనూ 24 క్యారెట్ల ధరలు 1,42,150–1,42,300, 22 క్యారెట్లు 1,30,300–1,30,450 వద్ద ఉన్నాయి.

Close-up of gold and silver coins showing latest record-high prices in India
Gold and Silver coins reflecting record-high prices in India today

నేటి సిల్వర్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. శనివారం 1 కేజీ సిల్వర్ రూ.2,75,000 ఉండగా, నేడు 2,87,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లోనూ 2,70,000 వద్ద పలుకుతోంది. ఒక్కరోజే 1 కేజీ సిల్వర్ పై రూ.12,000 పెరుగుదల చోటు చేసుకుంది. పెట్టుబడిదారులు వెంటనే కొనుగోలు చేయాలని సూచన.

అందువల్ల, Gold & Silver కోసం పెట్టుబడిదారులు, ఇప్పుడు మార్కెట్‌ను గమనించాలి. ధరలు ఇప్పటి కంటే ఇంకా ఎగిసి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Author:Qamar SD

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్