vaasthavanestham.com
Date of Publish : 02 January 2026, 2:22 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Gold, Silver Rates Jan 2: జనవరి 2న పసిడి, వెండి ధరలు ఇవే..

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న అనేక అంతర్జాతీయ మార్కెట్లకు సెలవులు ఉండటంతో ట్రేడింగ్ పరిమితంగా సాగింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. భారత మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండి ధర మాత్రం వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర
రూ.1,35,070గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,810గా ఉంది. వెండి ధర కిలోకు స్వల్పంగా తగ్గి రూ.2,37,900కి చేరింది.

గత ఏడాది బంగారం, వెండి పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడులు ఇచ్చాయి. బంగారం సుమారు 80 శాతం వరకు, వెండి 150 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాదిలో కూడా అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ ఆధారంగా ధరల్లో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

నగరం 24 క్యారెట్ (₹) 22 క్యారెట్ (₹) 18 క్యారెట్ (₹)
చెన్నై 1,36,130 1,24,390 1,03,740
ముంబై 1,35,070 1,23,810 1,01,300
న్యూఢిల్లీ 1,35,220 1,23,960 1,01,450
హైదరాబాద్ / బెంగళూరు / కోల్‌కతా 1,35,070 1,23,810 1,01,300

 

నగరం వెండి ధర (₹ / కిలో)
చెన్నై 2,55,900
ముంబై / ఢిల్లీ / కోల్‌కతా 2,37,900
హైదరాబాద్ / విజయవాడ / కేరళ 2,55,900

 

– QAMAR SD

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తరచూ మారుతుంటాయి. కొనుగోలు లేదా పెట్టుబడి
నిర్ణయం తీసుకునే ముందు తాజా రేట్లు మరోసారి పరిశీలించుకోవడం మంచిది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్