vaasthavanestham.com
Date of Publish : 28 October 2025, 9:50 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Good news to Central Government employees | కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

ఎనిమిదవ వేత‌న క‌మిష‌న్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు కోటి 15 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ centre (Government employees)ఉద్యోగులు, పింఛ‌న్ దారుల‌కు వేత‌నాలు, పింఛ‌న్లు పెంచేందుకు వీలుగా 8 వ వేత‌న క‌మిష‌న్ కు మంగ‌ళ‌వారం నాడు కేంద్ర కాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఇప్పుడున్న ఏడవ వేత‌న స‌వ‌ర‌ణ సంఘం (seventh Pay Commission) కాల ప‌రిమితి 2026తో ముగుస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త జ‌న‌వ‌రిలో 8 వ వేత‌న సంఘాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎనిమిదవ వేత‌న సంఘంపై కేంద్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో విస్తృతంగా చ‌ర్చించిన అనంత‌రం ఈ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిదవ వేత‌న సంఘం 18 నెల‌ల్లో సిఫార‌సులు ఇవ్వ‌నుంది.

కాగా 8వ వేత‌న సంఘం (Eighth Pay Commission) 50 ల‌క్ష‌ల మంది కేంద్ర ఉద్యోగులు, 65 ల‌క్ష‌ల మంది పింఛ‌ను దారుల‌కు వేత‌నాలు, పింఛ‌న్లు ఎంత ఉండాలో కేంద్ర ప్రభుత్వం ప‌లు సూచ‌న‌లు చేయ‌

నుంది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్