వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పీఏసీ (PAC) కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల పీఏసీ కమిటీ సభ్యులకు ఆయన అధికారికంగా నియామక పత్రాలను అందజేశారు.
ఇచ్చోడ కాంగ్రెస్ మండల నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా చోలే ప్రభాకర్, నడికుంటూ ఆశన్న, మండల అధికార ప్రతినిధిగా బొజ్జ రవి నియమితులయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా చిక్రం నాగరావు, వెంకట్ రెడ్డి, పట్ల గోవర్ధన్, అబ్దుల్ అజీమ్ బాధ్యతలు చేపట్టగా, కార్యదర్శులుగా షేక్ సిద్ధిఖ్, షేక్ మజహర్, విద్యాసాగర్ రెడ్డి, కనక హరీష్, ఇంగోలి ప్రవీణ్, చౌహాన్ రాందాస్‌లను నియమించారు. మండల కార్యవర్గ సభ్యులుగా షేక్ అలీమా బేగం, కేంద్ర వినాయక్, షేక్ వహీద్, షేక్ జహీర్, తుకారం, భూతి రాజేశ్వర్, హుస్సేన్ ఖాన్ తదితరులకు నాయకులు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కళ్లెం నారాయణ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కుమ్రం కోటేష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, స్థానిక సర్పంచ్ జలై జాకు, కోకస్ మన్నూర్ సర్పంచ్ యూసఫ్, సిరిసిల్ల సర్పంచ్ కాల రవి, కామగిరి సర్పంచ్ నిమ్మల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బద్దుల జైపాల్, ప్రధాన కార్యదర్శి కొత్తూరు లక్ష్మణ్, బోథ్ నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా, మాజీ ఏఎంసీ చైర్మన్ శంషుద్దీన్, మైనార్టీ మాజీ చైర్మన్ రషీద్, ఐఎన్‌టీయూసీ నాయకురాలు జుగ్నక్ వనిత, సీనియర్ నాయకులు కిషన్ చౌహాన్, షాదుల్లా, మాజిద్ ఖాన్, మహబూబ్, షేక్ సాదిక్, ఎల్. శివాజీ, కదం శివాజీతో పాటు పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!