vaasthavanestham.com
Date of Publish : 09 May 2026, 12:44 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

మండే ఎండల్లో మూగజీవాలకు ఆసరా.!

• దాహార్తి తీరుస్తూ మానవత్వం చాటుకుంటున్న మదీనా హోటల్ యజమాని
• గఫార్ ను ప్రశంసిస్తున్న స్థానికులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: వేసవి తాపానికి మనుషులే కాదు.. మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రతకు గుక్కెడు నీటి కోసం వీధుల్లో అలమటిస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి అసామాన్యమైన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. నోరు లేని జీవాల ఆకలి, దప్పులను తీరుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్థానికంగా ఉండే ‘మదీనా హోటల్’ యజమాని గఫార్ చేస్తున్న ఈ నిస్వార్థ సేవ ప్రస్తుతం పలువురి మన్ననలు పొందుతోంది.

రోజురోజుకూ భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నీడ దొరకక, గుక్కెడు నీరు లేక వీధి కుక్కలు, పశువులు, పక్షులు పడుతున్న అవస్థలు గఫార్ హృదయాన్ని ద్రవింపజేశాయి. కేవలం తన వ్యాపార పనులకే పరిమితం కాకుండా, ఆ మూగజీవుల కోసం తనవంతు సాయం చేయాలని ఆయన కోరారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్