vaasthavanestham.com
Date of Publish : 31 December 2025, 7:44 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

NREGS Social Addit | ఇచ్చోడలో ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రమైన ఇచ్చోడలోని రైతు వేదిక భవనంలో మంగళవారం ఉపాధి హామీ పథకం 15 వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను నిర్వహించారు. 01-04-2024 నుండి 31-03-2025 వరకు ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించిన పనులను చదివి వినిపించారు. 20-12-2025 నుండి 29-12-2025 వరకు గ్రామాలలో సామాజిక తనీఖీలు (NREGS Social Addit) చేయడం జరిగిందనీ ప్రోసోడింగ్ అధికారి డి.ఆర్.డి.ఓ కుటుంబరావు తెలిపారు. ఉపాది హామీ ద్వార మందలో మొత్తం 899 పనులు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉపాది హామీ పథకం ద్వారా రూ. 6,75,45,696, పంచాయతీ రాజ్ ద్వారా రూ.4,52, 20377, అటవీ శాఖ వారి ద్వారా రూ.22,41,474 వివిధ రకాల పనులు చేయడం జరిగిందనీ పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు రూ.6,51,29,713, సామగ్రి ఖర్చు కింద రూ.24,64,601చెల్లించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల ద్వారా ఉపాధి హామీ పథకంలో మొత్తం రూ.11,49,89,547 ఖర్చు చేసిన ట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడి కృష్ణారావు, ఏ.వి.ఓ రాజేశ్వర్, అంబుడ్స్ పర్సన్ వీణ, ఎంపీడీవో నాగం నరేష్, పి.ఆర్ ఏ.ఈ నర్సింగ్, ఏ.పి.ఓ నరేంధర్ గౌడ్, ఎస్.అర్.పి కోమురయ్య, టెక్నికల్ అసిస్టెంట్ రాజు గౌడ్, గ్రామా పంచాయితీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్