vaasthavanestham.com
Date of Publish : 23 January 2026, 5:03 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Ichoda Si | ఇచ్చోడకు నూతన ఎస్సైగా గోకల రమేష్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: సాధారణ బదిలీల్లో భాగంగా గోకల రమేష్‌ను ఇచ్చోడ ఎస్సై గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేసి బాధ్యతలను స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సీ గోకల రమేష్ గతంలో ఆర్మూర్ పట్టణంలో ఎస్సైగా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై ఇచ్చోడకు నియామకం పొందారు. ప్రస్తుతం ఇచ్చోడ ఎస్.హెచ్.ఓ గా బండారి రాజు విధులు నిర్వహిస్తుండగా, అదనంగా నూతన ఎస్సైగా రమేష్‌ను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు ఇచ్చోడలో ఎస్సై గా పనిచేసిన పురుషోత్తంను బోథ్ ఎస్.హెచ్.ఓ గా బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్