వాస్తవ నేస్తం,ఇచ్చోడ మండల కేంద్రంలోని మాదాపూర్ గ్రామస్తులు తీవ్రమైన మొబైల్ సిగ్నల్ సమస్యతో సతమతమవుతున్నారు. గ్రామంలో నెట్‌వర్క్ లేక పడుతున్న ఇబ్బందులుదృష్టిలో ఉంచుకుని, తక్షణమే జియో టవర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు జియో సంస్థ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సరైన సిగ్నల్ అందక కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో వైద్యం, ఇతర అవసరాల కోసం ఎవరినైనా సంప్రదించాలన్నా సిగ్నల్ లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ వాపోయారు. జియో సంస్థ యాజమాన్యం స్పందించి, మాదాపూర్ గ్రామంలో నూతన టవర్‌ను తక్షణమే ఏర్పాటు చేసి తమ సిగ్నల్ కష్టాలను తీర్చాలని వారు కోరారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!