vaasthavanestham.com
Date of Publish : 04 August 2026, 11:22 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ప్రతి ఇంటా మొక్కలు నాటి.. పచ్చని గ్రామాన్ని నిర్మిద్దాం!

• నేడు నాటిన మొక్కే.. రేపటి జీవనాధారం

 * మాదాపూర్‌లో ఇంటింటికీ మొక్కల పంపిణీ చేసిన సర్పంచ్ షేక్ ఇమ్రాన్

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మాదాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హోమ్‌స్టెడ్ ప్లాంటేషన్ (ఇంటింటి ఆవరణలో మొక్కలు నాటే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామస్తులకు స్వయంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నేడు మనం నాటే మొక్కే, మన భావితరాలకు రేపటి జీవనాధారం అని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఇంటా విధిగా ఒక మొక్కను నాటడమే కాకుండా, చెట్టుగా ఎదిగే వరకు దానిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. గ్రామస్తులందరి సమిష్టి కృషితోనే మాదాపూర్‌ను పచ్చని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలమని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్