vaasthavanestham.com
Date of Publish : 22 October 2025, 10:45 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

National News Updates: రాష్ట్రపతి హెలికాప్టర్‌కి ప్రమాదం..

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ కుంగిన ఘటన జరిగింది. పతనంతిట్ట జిల్లా, ప్రమడం ఇండోర్ స్టేడియంలో ఇది జరిగింది. శబరిమల దర్శనానికి వెళ్తున్న రాష్ట్రపతి హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసిన వెంటనే, కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌లోని కాంక్రీట్ బలహీనత కారణంగా భాగం కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రాలు డిప్రెషన్‌లో చిక్కుకున్నాయి. భద్రతా సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది కలిసి హెలికాప్టర్‌ను భౌతికంగా లాగి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ముర్ము పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు జరగలేదు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి నుంచి 24 వరకూ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఉంది. దుబాయ్, యూఏఈ, అబుదాబిలో పర్యటిస్తారు. నేడు జూబ్లీహిల్స్ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు గడువు ఉంది. నవంబర్ 11 పోలింగ్, 14 కౌంటింగ్, ఫలితం ఉంటుంది. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన నాలుగో రోజు సాగుతోంది. నేడు హైదరాబాద్‌లో రాత్రి 7 గంటల నుంచి సదర్ ఉత్సవ మేళా ఉంటుంది. అప్పుడు నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నేడు కార్తిక మాసం ప్రారంభమైంది. ఇలాంటి మన రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్