vaasthavanestham.com
Date of Publish : 16 November 2026, 9:50 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: సర్పంచ్ షేక్ ఇమ్రాన్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని మాదాపూర్ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని షార్ప్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక భరోసా కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. మాదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందేలా నా వంతు బాధ్యతగా పనిచేస్తాను” అని స్పష్టం చేశారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్జా , ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్