vaasthavanestham.com
Date of Publish : 22 October 2025, 4:17 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Peanut Seeds : రాయితీ శనగ విత్తనాల పంపిణీ

వాస్తవ నేస్తం, ఇచ్చోడ : ఇచ్చోడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్తానిక రైతు వేదిక భవ నంలో రైతులకు రాయితీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఆత్మ చైర్మన్ అశోక్, వ్యవసాయ అధికారిని తిరుమల కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భం గా వ్యవసాయ అధికారిని తిరుమల మాట్లాడారు. రబీ సీజన్ నేపథ్యంలో మండలానికి ఎన్బీఈజీ – 47 అనే రకం గల 261 రాయితీ శనగ విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. 25 కేజీల శనగ బస్తా రూ 1500 ఉందన్నారు. కావలసిన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో వ్యవ సాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్