* ఘనంగా స్వాగతం పలికిన సర్పంచ్ షేక్ ఇమ్రాన్
* గ్రామ అభివృద్ధిపై కలెక్టర్‌కు సమగ్ర వివరాల వెల్లడి
వాస్తవ నేస్తం ఇచ్చోడ : మండలంలోని మాధాపూర్ గ్రామపంచాయతీని జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు గ్రామ సర్పంచ్ షేక్ ఇమ్రాన్ , కాంగ్రెస్ నాయకులు షాదుల్లా పూలమాలలు, శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై సర్పంచ్ కలెక్టర్‌కు వివరించారు.
గ్రామ మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న సిసి (CC) రోడ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులతో పనులు ప్రారంభించనున్నట్లు సర్పంచ్ షేక్ ఇమ్రాన్ కలెక్టర్‌కు తెలియజేశారు. అలాగే స్థానిక ఈద్గా, ఖబరస్తాన్ అభివృద్ధి కోసం విబి–గ్రామ్ జి (VB–GRAM G) పథకం కింద రూ.8 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత ప్రతిపాదనలను ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!