vaasthavanestham.com
Date of Publish : 28 September 2026, 10:15 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

గ్రామగ్రామాన తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేయాలి!

• నాయకులకు పార్టీ అధినేత్రి కవిత దిశానిర్దేశం..

• మర్యాదపూర్వకంగా కలిసిన ఇచ్చోడ నేతలు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, గ్రామగ్రామాన పార్టీని విస్తరించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ అధినేత్రి కవిత పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన పలువురు తెలంగాణ రక్షణ సేన నాయకులు పార్టీ అధినేత్రి కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి గ్రామంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని నాయకులకు కవిత దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీకి బలమైన పునాదులు వేసి, తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రిని కలిసిన వారిలో తెలంగాణ రక్షణ సేన నాయకులు షేక్ సనా, బిలాల్, సతీష్ తదితరులు ఉన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్