vaasthavanestham.com
Date of Publish : 02 January 2026, 6:53 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వాస్తవ నేస్తం, వెబ్‌డెస్క్: మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, పెళ్లి సంబంధం కుదిరినా బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా మహిళల్లో గోల్డ్‌పై ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు.

ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రోజుకోలా మారుతూ వినియోగదారులను అయోమయంలోకి నెట్టుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గి ఊరటనిస్తే, మరో రోజు భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్నటి నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే రూ.1,050 పెరిగింది. నిన్న రూ.1,23,800గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,24,850కు చేరింది.

అదే విధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. నిన్న రూ.1,35,060గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1,140 పెరిగి రూ.1,36,200గా నమోదైంది. ఈ ధరలు హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి.

ఇక వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. బంగారంతో పాటు వెండిలో కూడా వచ్చిన ఈ పెరుగుదల పెట్టుబడిదారులు, గృహ వినియోగదారులను ఆలోచనలో పడేస్తోంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

నేటి ధరల ప్రకారం హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,200గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

– QAMAR SD

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్