vaasthavanestham.com
Date of Publish : 30 October 2025, 4:03 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

TRAI : నంబర్ సేవ్ లేకున్నా కూడా.. అవతలి వ్యక్తి పేరు స్క్రీన్ పైన..

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : మొబైల్ లో సేవ్ లేని కాంటాక్ట్ నుండి మన మొబైల్ కి ఎవరైనా కాల్ చేస్తే అవతలి వ్యక్తి వివరాలు వివరాలు ఫోన్ స్క్రీన్ పై కనిపించేలా టెలికం సంస్థ నిర్ణయం తీసుకుంది. మన ఫోన్‌కి ఎవరైనా కాల్ చేస్తే.. కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్‌తో పాటు అతని పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం విభాగం (DoT) ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది.

ఈ నిర్ణయంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) దీనికి ఆమోదం తెలిపింది. మన కాంటాక్ట్ లిస్ట్‌లో నంబర్ సేవ్ లేనివారు ఎవరైనా కాల్ చేస్తే.. వారి నంబర్ మాత్రమే మనకు కనబడుతుంది. ఎవరో తెలియకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంది. అలాగే అనేక స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతుంటాం. కొన్ని ఫేక్ కాల్స్ లిఫ్ట్ చేయడం ద్వారా అకౌంట్‌లో నుంచి డబ్బులు కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. దీని నియంత్రించేతకు దీని నియంత్రించేందుకు టెలికాం సంస్థ అడుగులు వేస్తోంది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్