vaasthavanestham.com
Date of Publish : 16 September 2026, 12:55 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్‌ఛార్జిగా రాథోడ్ బాపూరావు

• ఇచ్చోడలో టపాసులు పేల్చి నాయకుల సంబరాలు

• మండల అధ్యక్షుడు బిలాల్‌కు కేఆర్కే వైద్యుల సన్మానం

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నియమితులయ్యారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు నాయకులు, అనుచరులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాథోడ్ బాపూరావు నియామకం పట్ల జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాథోడ్ బాపూరావుకు జిల్లా బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. బాపూరావు నాయకత్వంలో జిల్లాలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు మారుతి, సనావుల్ల, కలీం తదితరులు పాల్గొన్నారు.

మండల అధ్యక్షుడు బిలాల్‌కు సన్మానం: 

ఈ సందడి మధ్య, తెలంగాణ రక్షణ సేన ఇచ్చోడ మండల అధ్యక్షుడు బిలాల్‌ను స్థానిక కేఆర్కే (KRK) హాస్పిటల్ వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు.

TRS leaders celebrating Ex-MLA Rathod Bapurao appointment in Ichoda
TRS leaders and supporters celebrate Ex-MLA Rathod Bapurao’s appointment as Adilabad district in-charge.

ఆయనను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్