📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeSports Newsఇండియాలో కామన్వెల్త్ గేమ్స్‌!..అహ్మదాబాద్‌లో 2030 గేమ్స్‌

ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్‌!..అహ్మదాబాద్‌లో 2030 గేమ్స్‌

వాస్తవ నేస్తం,న్యూఢిల్లీ: దేశ క్రీడారంగానికి గుడ్‌ న్యూస్‌. ఇండియాలో చాన్నాళ్ల తర్వాత ఓ మల్టీ స్పోర్ట్స్ మెగా ఈవెంట్‌ జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌ ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు కీలక అడుగు పడింది. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ను ప్రతిపాదిస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సిఫారసు చేసింది. దీన్ని కామన్వెల్త్ స్పోర్ట్స్ తమ ఫుల్ మెంబర్స్‌కు పంపిన తర్వాత నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఈ గేమ్స్‌ ఆతిథ్య హక్కులు ఇండియాకు లభిస్తే 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే మన దేశ ఆశయానికి మరింత బలం చేకూరనుంది. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్‌కు 2030 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. ఈ హిస్టారికల్‌ సెంచరీ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇండియా దక్కనుంది. ఇంతకుముందు 2010లో న్యూఢిల్లీలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌ను మన దేశంసక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. 72 దేశాలు పోటీ పడే ఈ గేమ్స్ కోసం అప్పట్లో ఇండియా భారీగా ఖర్చు చేసింది. తొలుత గేమ్స్ బడ్జెట్‌ను రూ. 1600 కోట్లుగా అంచనా వేయగా.. చివరకు 70 వేల కోట్లు ఖర్చు చేశారు. 2030 ఆతిథ్యం కోసం అహ్మదాబాద్‌తో పాటు నైజీరియాలోని అబూజా నగరం కూడా పోటీపడింది. అయితే, కామన్వెల్త్ స్పోర్ట్.. నైజీరియా బిడ్‌ను ప్రశంసిస్తూనే , 2034 గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి ప్లాన్‌ రూపొందించాలని నిర్ణయించింది. ఆఫ్రికా ఖండంలో కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించాలనే తమ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని ఎగ్జిక్యూటివ్ బోర్డు పేర్కొంది. ‘2030లో వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్‌కు ప్రతిపాదిత ఆతిథ్య నగరంగా ఇండియాలోని అహ్మదాబాద్‌ను సిఫార్సు చేస్తున్నట్లు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ధృవీకరించింది’ అని కామన్వెల్త్ స్పోర్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి :  Womens Cricket World Cup 2025 | లేడీస్ క్రికెట్ వరల్డ్ కప్ 2025: భారత్ మ్యాచ్ వర్షం ఆపేసింది – ఇంగ్లండ్ ఘన విజయం
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page