📄 ePaper
Thursday, April 2, 2026
📄 ePaper
HomePolitical NewsAdilabad Municipal Corporation | ఆదిలాబాద్‌ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా..!?

Adilabad Municipal Corporation | ఆదిలాబాద్‌ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా..!?

• 21 వార్డుల్లో బీజేపీ విజయం

• పీఠం దక్కించుకునే దిశగా అడుగులు

• కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

21 స్థానాల్లో కాషాయ జెండా

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 49 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పట్టణ ఓటర్లు బీజేపీ అభ్యర్థుల పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో 21 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి, చైర్మన్ పీఠానికి చేరువయ్యారు.

రెండవ స్థానంలో కాంగ్రెస్.. బలం చాటిన బీఆర్ఎస్

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. గత అంచనాలకు భిన్నంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంది. ఆ పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించి, కౌన్సిల్ ఏర్పాటులో తమ పాత్ర కూడా ఉండబోతోందని సంకేతాలిచ్చింది. ఇక పాతబస్తీ ప్రాంతాల్లో పట్టున్న ఎంఐఎం (మజ్లిస్) పార్టీ యథావిధిగా 6 వార్డుల్లో గెలుపొందింది.

పీఠం గణాంకాలు ఇలా ఉన్నాయి:
బీజేపీ గెలిచిన కౌన్సిలర్లు: 21
బీజేపీ ఎక్స్ అఫీషియో ఓట్లు: 3
మొత్తం బలం: 24

కింగ్ మేకర్లుగా ‘స్వతంత్రులు’

తాజా ఫలితాల సరళిని బట్టి చూస్తే, 5 స్థానాల్లో గెలిచిన ఇండిపెండెంట్లు (స్వతంత్ర అభ్యర్థులు) ఇప్పుడు ‘కింగ్ మేకర్లు’గా మారారు. బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపినా, మ్యాజిక్ ఫిగర్ ను దాటడానికి మరో ఒకటి లేదా రెండు ఓట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకం కానుంది.

ఇది కూడా చదవండి :  బోథ్ గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాయిదా పడనుందా..?

ఫలితాల ఇలా వివరాలు:

పార్టీ గెలిచిన వార్డులు
బీజేపీ (BJP) 21
కాంగ్రెస్ (INC) 11
బీఆర్ఎస్ (BRS) 06
ఎంఐఎం (MIM) 06
ఇండిపెండెంట్లు 05
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page