వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(America president Donald Trump )మరోసారి తన పత్యేకతను చాటుకున్నారు. తనదైన స్టెప్పులతో డాన్స్ చేసి అందరిని అబ్బురపరచారు. ఇప్పుడు ట్రంప్ డాన్స్ విడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు మలేసియా(Malaysia Kuala Lumpur) వెళ్లిన ట్రంప్.. కౌలాలంపూర్ విమానశ్రయంలో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు. ట్రంప్ విమానం దిగి రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. మలేసియన్ సంప్రదాయ నృత్య కళాకారులు డాన్స్ చేస్తూ ట్రంప్ ను అలరించే ప్రయత్నం చేశారు. వెంటనే ట్రంప్ వారి డాన్స్ పట్ల ఆకర్షితుడై వారితో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. అక్కడ ట్రంప్ మార్క్ డాన్స్ చూసి మలేసియా ప్రధాని ఇబ్రహీం కూడా జతకలిశారు. ఇప్పుడీ విడియోలు అంతర్జాలంలో విపరీతమైన ట్రెండింగ్‌లో ఉన్నాయి.
